Congress: కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేకే
ABN , Publish Date - May 16 , 2024 | 02:56 PM
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్‌లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
హైదరాబాద్, మే 16: మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) చేస్తున్న కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (Congress Leader KK Mahender Reddy) స్పందించారు. పద్మశాలిలు నిరోద్‌లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన వాటిని అమ్ముకుంటే తప్పు లేదని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
AP Elections: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్...
రాజకీయ భవిషత్తు కోసం మోదీ దగ్గర మోకరిల్లిన పార్టీ బీఆర్‌ఎస్ అని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వెయ్యండని బీఆర్ఎస్ నేతలే చెప్పారన్నారు. లిక్కర్ రాణి, కూతురు కవితను జైలు నుంచి విడిపించడానికి బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారని విమర్శించారు. ‘‘నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మోదీ కనుసన్నల్లో కేసీఆర్ ఉన్నాడు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని నన్ను ఆడిగాడని స్వయంగా మోడీనే చెప్పిండు. వాళ్ళ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో తెలియాలి. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎవరు కోన్ కిస్కా. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేసిండ్రు. సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టి ఆయన పొలాలకు నీళ్లు తీసుకెళ్లిండు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేసిండు’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?
AP Government: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్
Read Latest Telangana News AND Telugu News