Viral Video: ఇందులో తప్పెవరిది.. రోడ్డు దాటుతున్న వ్యక్తి.. బైకుపై వచ్చి చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 11:09 AM
ఓ వ్యక్తి రోడ్డు దాటుతుంటాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అతను ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. ఫోన్‌లో మునిగిపోయిన ఆ వ్యక్తి.. ఎదురుగా వాహనాలు వస్తున్నాయన్న స్పృహ కూడా లేకుండా దాటుతున్నాడు. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ బైకుపై రావడంతో చివరికి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో చాలా మంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్నారు. కొందరైతే చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా తమ ఫోన్‌లో మునిగిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతుండగా.. మధ్యలో బైకుపై వచ్చిన పోలీసు.. అతన్ని చెంపదెబ్బ కొడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుంటాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అతను ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. ఫోన్‌లో మునిగిపోయిన ఆ వ్యక్తి.. ఎదురుగా వాహనాలు వస్తున్నాయన్న స్పృహ కూడా లేకుండా దాటుతున్నాడు. కొన్ని వాహనాలు అతడిని దాదాపు ఢీకొట్టేంత దగ్గరలో వెళ్లాయి.
Train Stunts Video: రైలింజన్‌పై షాకింగ్ సీన్.. విద్యుత్ పాంటోగ్రాఫ్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..
అయినా ఆ వ్యక్తి కొంచెం కూడా భయం లేకుండా ఫోన్ చూసుకుంటూనే (man crossing road looking at his phone) రోడ్డు దాటుతున్నాడు. మధ్యలోకి రాగానే అటుగా బైకుపై వచ్చిన పోలీసు.. అతన్ని చూసి ఆగ్రహంతో ( policeman slapped the youth) చెంప దెబ్బ కొడతాడు. దెబ్బకు అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. నొప్పి తట్టుకోలేక చెంపపై చేయి పెట్టుకుని, రోడ్డుపై కూర్చుండిపోతాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా షాకింగ్ సీన్.. పెద్ద రాయిని పక్కకు తీసి చూడగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రోడ్డు దాటుతున్న వ్యక్తిదే తప్పు’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్ చూసుకుంటూ రావడం తప్పే అయినా.. పోలీసు కూడా హెల్మెట్ లేకుండా వస్తున్నాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5,400కి పైగా లైక్‌లు, 3.86 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: 13వ అంతస్తు నుంచి కిందపడ్డ బాలిక.. చివరకు జరిగింది చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..