Share News

AP Elections: మేమెప్పుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్న బొత్స

ABN , Publish Date - Apr 26 , 2024 | 02:01 PM

Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మీద ఆధార పడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎపుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్నారు. రాష్ట్ర ప్రయోజన కోసం మాత్రమే బిల్లుల విషయంలో సమర్ధించామన్నారు.

AP Elections: మేమెప్పుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్న బొత్స
Minister Botsa Satyanarayana

విశాఖపట్నం, ఏప్రిల్ 26: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మీద ఆధార పడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎపుడూ బీజేపీతో (BJP) చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్నారు. రాష్ట్ర ప్రయోజన కోసం మాత్రమే బిల్లుల విషయంలో సమర్ధించామన్నారు. రాజకీయ ప్రయోజనాలు కోసం కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గిస్తే... బీజేపీ కొట్టుకు పోతుందన్నారు. బీజేపీతో రాజకీయ పరమైన సంబంధాలు లేవని.. తాము ఎప్పుడూ సంఘర్షణ పడలేదని మంత్రి పేర్కొన్నారు.

TDP: వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారు: కనకమేడల


షర్మిల, సునీతపై ఇలా..

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపైనా విమర్శలు గుప్పించారు. షర్మిలా ఒక పార్టీ లో ఉన్నారని.. ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నారని అన్నారు. విమర్శలు చేసేటప్పుడు ఆమె సంయమనం పాటించాలని సూచించారు. నిన్నటి వరకు చెల్లి... ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు అని అన్నారు. ఇక చెల్లి, అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి? పెళ్లిళ్లకు పేరంటాళ్లలో ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. అలాగే.. జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ సునీత రెడ్డి ఇచ్చిన సలహాపైనా మంత్రి స్పందించారు. తలకి పెట్టుకున్న బ్యాండేజీ తీసుకోవాలా లేదా అనేది జగన్ దగ్గర ఉన్న డాక్టర్లు చూసుకుంటారన్నారు. ఆమె దూరం నుంచి సలహా ఇస్తున్నారంటూ సునీతపై విరుచుకుపడ్డారు. ‘‘ఫోన్లో కన్సల్టెన్సీకి , చెయ్యి పట్టుకొని వైద్యం చేసే డాక్టర్లకు తేడా లేదా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.


పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి పీయూష్ గోయిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ఇచ్చామని.. ఒప్పందం జరిగిందని తెలిపారు. ‘‘మాది మాఫీయా ప్రభుత్వమా?.. చేతకాని దద్దమ్మలు మాపై విమర్శలు చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ఎలక్ట్రోల్ బాండ్స్ అవినీతిని దేశం అంతా చూసిందని.. తమపై చౌకబారు విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ బదిలీల్లో అవినీతి జరిగిందని రోజూ వార్తలు రాస్తున్నారని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పదవ తరగతి పరీక్షలలో ఒక ఆరోపణలు రాకుండా నిర్వహించామని.. .మంచి ఉత్తీర్ణత శాతం వచ్చిందన్నారు. సరైన సమాచారం లేకుండా విమర్శలు చేయడం సమజసం కాదని అన్నారు. 2014 నుంచి 2018 వరకు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఉందని.. అప్పుడు ఏం సాధించారని..అప్పుడు ఒక ఇంజన్‌కు రిపేర్ వచ్చిందా? అంటూ మంత్రి బొత్స సత్యానారాయణ ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్..!

AP Elections 2024: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 02:26 PM