Nara Bhuvaneshwari: అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలు
ABN , Publish Date - Jun 18 , 2024 | 03:41 PM
తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తెలిపారు.
అమరావతి: తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తెలిపారు. నాడు ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశా. బాధలు విన్నా. ఇబ్బందులు తెలుసుకున్నాను. అణచివేతను అర్థం చేసుకున్నానని అన్నారు.ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంలో ఉన్నారని చెప్పారు.
స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారన్నారు. నాడు వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ...తాము పడిన క్షోభపై ప్రతి ఒక్కరూ గళం విప్పుతున్నారని తెలిపారు. నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలిక పడ్డాయన్నారు. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయని చెప్పారు. ఇది తన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చారు.
ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్ర బాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని ఉద్ఘాటించారు. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నెరవేరుతుందని చెప్పారు.
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని అన్నారు. ప్రజలే సుప్రీం అని చాటి చెప్పిన తిరుగులేని తీర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువుదీరుతుందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్
Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!
TDP: జగన్ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని
Read Latest AP News and Telugu News