Anitha: జగన్ ది అంత డ్రామా...
ABN , Publish Date - Jul 24 , 2024 | 03:41 PM
Andhrapradesh: ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైనాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు.
అమరావతి, జూలై 24: ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగలపూడి అనిత (Homeminister Vangalapudi Anitha) వ్యాఖ్యలు చేశారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైనాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారన్నారు. గతంలో ప్రతిపక్షాలను నోటి కొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు.
JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం
ఢిల్లీ వెళ్ళి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని... ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని హోంమంత్రి అన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడుగా హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. రూ.15 వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ మోదీకి ధన్యవాదాలు చెప్పాలన్నారు. జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారని..అందులో వైసీపీ హయాంలో జరిగినవి ఉన్నాయేమో చూసుకోవాలన్నారు. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలవరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారు.. కేటీఆర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్న రేవంత్..!
అమరావతిలో మహిళా రైతులు ధర్నాలు చేస్తే ఆ ఫొటోలు పెట్టలేదే అని అన్నారు. గత ఐదేళ్లలో తమరు చేసిన ఘటనలు ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం సరిపోదంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ కూటమి హయాంలో 36 మంది హత్యలు గావించబడ్డాయని జగన్ చెప్పారని.. హోంమంత్రిగా చెబుతున్నా ఇప్పటిదాకా నాలుగు హత్యలు జరిగాయని..అందులో ముగ్గురు టీడీపీ వాళ్లు చనిపోయారని తెలిపారు. ఒకతను వైసీపీ అని అన్నారు. మిగతా 34 మంది హత్యల వివరాలు జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో కాదు జగన్ ఏపీలో ధర్నా పెడితే మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు కాదు కదా జగన్ కుటుంబ సబ్యులు కూడా వినరన్నారు. అసెంబ్లీని ఎగ్గొట్టాలనే జగన్ ఢిల్లీ వెళ్లి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జగన్ ది సినిమా సెట్టింగే అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో ఎన్ని జరిగాయో... తమ హయాంలో ఎన్ని జరిగాయో నిరూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. శాంతి బధ్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు.
CM Chandrababu: ఆలోచన లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు.. ల్యాండ్ టైటలింగ్ బిల్లుపై చంద్రబాబు ఫైర్
అధికారం పోయిన వెంటనే జగన్‌కు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నారని.. అప్పుడు ఎందుకు అడగలేదు జగన్ ప్రత్యేక హోదా అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు రాజ్యాంగం గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. జగన్ 36 రాజకీయ హత్యలన్నారు కదా వాళ్ల పేర్లు ఇవ్వాలన్నారు. 36 రాజకీయ హత్యలు జరిగితే ఒక్కరినే ఎందుకు పరామర్శించారని నిలదీశారు. జగన్ ది అంత డ్రామా అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth: కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్
Read Latest AP News And Telugu News