Share News

Rammohan Naidu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 20 , 2024 | 06:39 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు.

Rammohan Naidu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన
Rammohan Naidu

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోనుకు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయానికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పారు.


రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరమని అన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని గుర్తుచేశారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు. గత ఐదేళ్లల్లో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారని చెప్పారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తామని ప్రకటించారు.


ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి మైక్రోసాఫ్ట్ ఎర్రర్ సమస్య తొలిగిపోయిందని తెలిపారు. విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మాన్యువల్ పద్ధతిలో బోర్డింగ్ పాస్‌లు ఇష్యు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి విమానాలన్నీ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jul 20 , 2024 | 06:46 PM