Sana Satish: ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి.. టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:19 PM
Sana Satish: ముద్రగడ పద్మనాభరెడ్డి, వైసీపీపై తెలుగుదేశం ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి డ్రామానే అని ఆరోపించారు. ఈ దాడి వైసీపీ చేయించినట్లుగా ఉందని సానా సతీష్ అనుమానం వ్యక్తం చేశారు.

కాకినాడ: వైసీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి (Mudragada Padmanabha Reddy) కిర్లంపూడిలోని నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం సృష్టించాడు. ఆదివారం ఉదయం గన్నిశెట్టి గంగాధర్ (Gannishetty Gangadhar ) అనే యువకుడు మద్యం సేవించి.. ట్రాక్టర్‌తో వచ్చి భయాందోళనకు గురిచేశాడు. అయితే ఈ దాడిపై టీడీపీ ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై ఆకతాయి దాడిని వైసీపీ రాజకీయం చేయడం నీచమని ఎంపీ సానా సతీష్ విమర్శించారు.
దాడి చేసిన వ్యక్తి ఒకప్పుడు ముద్రగడ అనుచరుడే అని ఆరోపించారు. ఏవో వ్యక్తిగత లావాదేవీ గొడవలతో దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆకతాయి చేసిన దాడిని ముద్రగడపై దాడిలా వైసీపీ రాజకీయం చేస్తోందని.. ఈ డ్రామాపై జనం నవ్వు కుంటున్నారని ఎద్దేవా చేశారు. లేనిదానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడకు ఫోన్ చేయడం చూస్తుంటే అంతా వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా అర్థమవుతోందని చెప్పారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీని ఈ డ్రామాలతో ఇంకా పాతాళంలోకి పడి పోతుందని విమర్శలు చేశారు. గత పాలనలో వైసీపీ పాపాలు రోజుకొకటి బయటపడుతుండటంతో ఈ చిల్లర ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీ సానా సతీష్ విమర్శించారు.
పోలీసుల విచారణ..
కాగా, ముద్రగడ కాంపౌండ్‌లో పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలను గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకుని గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. లేక గంగాధర్ కావాలనే ముద్రగడ నివాసం వద్ద భీభత్సం సృష్టించాడా అనే విషయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ముద్రగడ కూతరు ఏమన్నారంటే..
అయితే, ముద్రగడ ఇంటిపై దాడిని జనసేన ఖండించింది. ముద్రగడ కూతరు, జనసేన నేత క్రాంతి ఈ దాడిపై స్పందించారు. కిర్లంపూడిలో తన నాన్న ఇంటిపై దాడి ఘటన తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు.. జై జనసేన అన్నంత మాత్రాన జనసేన వారు అయిపోరని చెప్పారు. ఇలాంటి దాడులను డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రోత్సహించరని చెప్పారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లుందని అన్నారు. ఎవరో చేసిన పనిని జనసేనకు ఆపాదించడం సరికాదని క్రాంతి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
Read Latest AP News And Telugu News