YSRCP: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:04 AM
YSRCP: విశాఖపట్నంలో ఓ బాధితురాలి సమస్య వింటే ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు వస్తాయి. వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని విశాఖపట్నం పోలీసులకు వివరించింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కీచకుడికి బుద్ది చెప్పారు.

విశాఖపట్నం: జగన్ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అడ్డగోలు దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారు. ఎదురు వచ్చిన వారితో దారుణంగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడేవారు. కేసు పెడితే ఎంతగానో హింసించే వారు. ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో రాష్ట్రంలో నమోదయ్యాయి. తప్పును ప్రశ్నించిన బాధితులను ఇన్నాళ్లూ అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగించింది. ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయింది. వైసీపీ హయాంలో రోజూ ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదల్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారు.
న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు..
బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమను బాధపెట్టిన వారికి చట్టం ముందుకు తీసుకు వచ్చి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఓ బాధితురాలి సమస్య వింటే ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు వస్తాయి. వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని విశాఖపట్నం పోలీసులకు వివరించింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కీచకుడికి బుద్ది చెప్పారు. వైసీపీకి చెందిన కిచకుడు పెబ్బలి రవికుమార్‌ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో వరుసకు కూతురైన యువతిని రవికుమార్ గర్భవతి చేశాడు. రవికుమార్‌పై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన నాయకుడు కావడంతో ఇప్పటివరకు రవికుమార్ దర్జాగా తిరిగాడు. ఏపీ బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులుగా గత వైసీపీ ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రవికుమార్ విశాఖపట్నం నుంచి పరారయ్యాడు. విజయవాడలో ఉన్నాడని తెలుసుకుని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
DGP Hari Shankar Gupta : మహిళల జోలికొస్తే మరణదండనే!
Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర
Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు
Read Latest AP News and Telugu News