CM Chandrababu: ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 29 , 2024 | 07:16 PM
గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం సూచనలు, సలహాలు చేశారు.
Also Read: Mp Krishnadevarayalu: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి పార్ధసారధి (Minister Parthasarathy) మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు. గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇస్తామని అన్నారు. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయనున్నామని వివరించారు.
Also Read: Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు
3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం..
‘‘గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల నిర్మాణమనేది ప్రభుత్వానికి హై ప్రయార్టీగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదిలోపు 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసింది. ఇళ్లు పూర్తి అయినా వైసీపీ ప్రభుత్వం పేమెంట్లు చెల్లించలేదు. ఇలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లని ఏర్పాటు చేస్తాం’’ అని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.
జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇస్తాం
‘‘జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి.. తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తాం. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగింది. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తాం. జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి.. మౌలిక సదుపాయాలను కల్పించలేదు.. మా ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ. 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 2014 - 2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టాం’’ అని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Midhun Reddy: ఏపీకి ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి
Vasantha Krishna Prasad: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజలకు మంచి చేద్దాం..
Minister Nimmala: మంత్రి సాహసం.. స్వయంగా అక్కడికి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి..
Purandeswari: ఏపీలో పథకాల మార్పుపై ఎంపీ పురందేశ్వరి ఏమన్నారంటే?
Read Latest AP News And Telugu News