Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను | Palla Srinivasa Rao said that he will take full responsibility of protecting the Visakha Steel Plant VK
Share News

Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:21 PM

స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది.

 Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను
Palla Srinivasa Rao

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని ఈరోజు(మంగళవారం) పల్లా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించానని తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థికంగా ప్లాంట్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు యువ నాయకుల రుణం తీర్చుకుంటానని మాటిచ్చారు.


తనకు ఏ పదవి ముఖ్యం కాదని.. స్టీల్ ప్లాంట్ ఆదుకోవడం తప్పా అని ఉద్ఘాటించారు. తన మీద పూర్తిగా విశ్వాసం ఉంచాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత తనదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మైన్స్‌ను స్టీల్ ప్లాంట్‌కు వచ్చేలా కృషి చేస్తానని పల్లా శ్రీనివాసరావు యాదవ్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Nara Bhuvaneshwari: అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలు

Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 08:23 PM