BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!
ABN , Publish Date - Mar 04 , 2024 | 02:39 PM
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
కడప, మార్చి 4: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై (Viveka Murder Case) సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి (Pulivendula TDP candidate is BTech Ravi) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ (MP Avinash Reddy) కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు (Narcoanalysis test) సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. లైవ్‌లో రాష్ట్రం మొత్తం చూసేలా ప్లాన్ చేయాలని సూచించారు. ‘‘దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్ కి ఒప్పుకోవాలి ఇదే నా సవాల్’’ అంటూ ఛాలెంజ్ విసిరారు. కేసు సీరియస్‌గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి (BJP) పోతాడని సునీతకు (YS Sunitha Reddy) జగన్ చెప్పక పోతే తాను నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. వివేక హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Mallu Ravi: నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్‌పై మల్లు రవి క్లారిటీ
అధికారంలో ఉండి ఎందుకు తేల్చలేదు?..
కేసులో జగన్ హస్తం ఉందనేది తొందరలో బయటకు వస్తుందన్నారు. వివేకానంద రెడ్డిని చంపే సమయంలో నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పెట్టారనే సమాచారం తమకుందన్నారు. హత్య చేయడానికి గొడ్డలి ఖర్చు ఫోన్ పే ద్వారా దస్తగిరికి సునీల్ యాదవ్, భాస్కర్ రెడ్డి ఇంటి నుంచి పంపారన్నారు. బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్‌కు విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు. లెటర్ సృష్టించారని ఆ రోజు జగన్ చెప్పారని.. తిరిగి ఆ లెటర్‌పై నానా రాద్ధాంతం చేస్తున్నది జగనే అంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన జగన్ సొంత బాబాయ్ కేసు ఎందుకు తేల్చలేదని నిలదీశారు. కేసు ముందుకు పోవద్దని అఫిడవిట్ వేసింది సీఎం జగన్ అని అన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి తల్లికి ఉదయం 5 గంటలకు ఎలా తెలిసిందో బయటకు రావాలని డిమాండ్ చేశారు. సునీతా రెడ్డి ప్రజల మద్దతు కోరడంతో జగన్ అభద్రతకు లోనయ్యారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత వస్తుందేమో అనే భయం జగన్‌కు మొదలయ్యిందన్నారు. పులివెందులలో అభద్రతా ఉంది కాబట్టి సతీష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారన్నారు. సునీత రెడ్డి పార్టీలోకి వస్తుందనే ఆలోచనతో వివేకా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి వెళ్లినట్టు ఒప్పుకున్నారన్నారు. ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ప్రజలే గమనించాలన్నారు. రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చిన విషయంలో దస్తగిరి సీబీఐని ఆశ్రయిస్తున్నారని.. కేసులో నిజా నిజాలు బయటకు వస్తాయని బీటెక్ రవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: సుప్రీంకోర్టుకు ప్రధాని మోదీ సెల్యూట్.. ఎందుకంటే..?
Lokesh: ఓటమి తేలిపోవడంతో ముసుగు తీసేసి జగన్ దుర్మార్గపు చర్యలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..