Share News

Venigandla Ramu: కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే

ABN , Publish Date - Mar 05 , 2024 | 04:29 PM

Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారని.. ఇప్పుడు రూ.370 కోట్ల రుణం ఎలా తెచ్చారని ప్రశ్నించారు.

Venigandla Ramu: కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే

కృష్ణా జిల్లా, మార్చి 5: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై (YSRCP MLA Kodani Nani) గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము (Gudivada tdp mla candidate venigandla ramu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి (Amaravathi) అంతా గ్రాఫిక్స్ అన్నారని.. ఇప్పుడు రూ.370 కోట్ల రుణం ఎలా తెచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పే ప్రతి మాట అబద్ధమే అని అన్నారు. దారుణంగా వైసీపీ ప్రభుత్వ (YCP Government) పాలన సాగుతుందని.. ఇక గుడివాడ ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళ మెడలో పుస్తెలతాడును ఎంత పవిత్రంగా భావిస్తారో రాష్ట్రానికి సచివాలయం అంత పవిత్రమైనదన్నారు. అటువంటి సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటు కొడాలి నాని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: సీఎం రేవంత్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ..


దేన్నైనా మూర్ఖంగా ముందుకు తీసుకెళ్లడమే వైసీపీ నాయకులకు అలవాటని.. ప్రజల మనోభావాలతో వారికి సంబంధం లేదన్నారు. గుడివాడలో ప్రజలకు త్రాగునీరు, రోడ్లు లేక అల్లాడుతుంటే వాటిపై స్పందన ఉండదన్నారు. జాతీయ నాయకుడల్లే ఏదేదో మాట్లాడుతారని.. పనికిమాలిన ఎమ్మెల్యే కొడాలి నాని అంటూ విరుచుకుపడ్డారు. రేపొద్దున ప్రజలు ఉఫ్ అని ఉదితే కొడాలి నాని ఎగిరిపోబోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులపై శ్రద్ధ చూపిస్తున్నట్లు.. ఆయనను అనరాని మాటలు అంటున్నారన్నారు. ప్రతి మాటకు సమాధానం చెప్పక తప్పదని తెలిపారు. కొడాలి నాని బ్రతుకే అబద్ధాలు, మోసాలతో నిండిందన్నారు. ఇలాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ మొత్తం భూస్థాపితం కాబోతుందని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

AP Govt: జగన్ సర్కార్ మరో కొత్త ఎత్తు

Breaking: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 04:37 PM