Home » LATEST NEWS
గుంటూరులో బర్డ్‌ఫ్లూ రీజనల్ సర్వెలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసిందని, ఇది వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో పని చేస్తుందని తెలియజేశారు. ఈ కేంద్రం ఐసీఎంఆర్ వైద్య బృందం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2010 వరకు ప్రఽధాన పంటగా ఉన్న బత్తాయి పండ్ల తోటల సాగు క్రమంగా క్షీణిస్తోంది.
శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 1996 వరల్డ్‌కప్ నెగ్గిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులను కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆ జట్టు సభ్యులైన...
ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50శాతానికి పైగా మహిళలకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించింది.
బ్రెజిల్లో జరుగుతున్న బాక్సింగ్ వరల్డ్‌క్‌పలో భారత యువ బాక్సర్ అభినాష్ జమ్వాల్ ఫైనల్‌కు చేరుకొని కనీసం రజతం ఖాయం చేశాడు...
భారత యువ షూటర్ స్విఫ్ట్ కౌర్, తెలంగాణ స్టార్ ఇషా సింగ్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో పతకాలతో సత్తా చాటారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో...
గోదావరిపై ప్రతిపాదించిన చిన్న కాళేశ్వరం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పదిహేనేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లాలో అప్పటి వైఎస్ సర్కార్ శంకుస్థాపన చేసిన కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐఎ్‌స-చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణం పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి.
చెన్నై-ఢిల్లీ మ్యాచ్ ఓ అరుదైన దృశ్యానికి వేదికైంది. ప్రత్యేక అతిథులతో సందడిగా మారింది. ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీ దేవి ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు....
ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో శనివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆ సంస్థ సీఈవో జగన్మోహన్రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయ శాఖతో పాటు ఇతర విభాగాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
కోవిడ్ తరహాలో అంతుచిక్కని ఓ వైరస్ రష్యన్లను తీవ్రంగా భయపెడుతోంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ కొత్త వైరస్.. ప్రపంచానికి మరో వైరస్ సవాల్ విసరనుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు.
భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది.
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాములను దర్శించుకునేందుకు ప్రముఖులు, వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కీలకఘట్టమైన ధ్వజారోహణకార్య క్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామక వ్యవహారం టీడీపీలో చిచ్చురేపింది. తాము సూచించిన వారికి పదవులు వస్తాయని భావించిన ఎమ్మెల్యేలు.. జాబితా చూసి షాక్ అయ్యారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జపాన్‌కు వెళ్లిన ఆయన టోక్యో నగరంలో పర్యటించారు.
Sitamma Gold Saree: సీతమ్మ వారికి బంగారు చీర సిద్ధమైంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల నేతన్న గోల్డ్ చీరను నేశారు.
Nigerian Drug Network: నగరంలో భారీ డ్రగ్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్ పోలీసులు చేధించారు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.
ఎంపురాన్తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహోస్‌లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం , మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు.
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ క్రమంలో 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విశాఖపట్నం కలెక్టర్‌ను ఆదేశించింది. విశాఖ వేదికగా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాటి టీడీపీ ప్రభుత్వం 2003లో బీమిలి బీచ్ రోడ్డులోని 34. 44 ఎకరాల భూమిని ఎస్పీ ప్రోడక్షన్‌కు కేటాయించింది.
బంగారు ఆభరణాలు తనఖా పెట్టి వచ్చిన డబ్బులు మెుత్తాన్ని ఖర్చుపెడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే.. తీసుకున్న అప్పులో కొంత తిరిగి చెల్లించాలని లేదా మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాలని అప్పు ఇచ్చిన సంస్థలు అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Bird Flu: రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూతో ఫౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టారు అధికారులు.
Bomb Scare: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. శుక్రవారంతో నామినేషన్లు ముగుస్తుండగా అటు పోటీపై పార్టీలో డైలమా కొనసాగుతోంది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.