Home » LATEST NEWS
జేఈఈ మెయిన్-2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది.
వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థన మేరకు 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌తో పోర్టు నిర్మించేందుకు ఒప్పందం సవరించడంపై నిర్ణయం తీసుకుంది
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్ సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. చర్చలు విఫలమైతే తాము దీటుగా తిప్పికొడతామని ఈయూ, చైనా హెచ్చరించాయి
వైఎస్ జగన్ ప్రభుత్వం "ఆప్కాస్" పేరుతో ఔట్సోర్సింగ్ నియామకాలను చేపట్టింది. ఈ నియామకాలు, అవసరమున్న చోట్ల కూడా అధికంగా జరిగాయని, మంత్రి వర్గం ఇప్పుడు వాటిపై విచారణ చేపట్టింది
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్త జనగణనలో సమగ్ర కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లను పెంచాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమించకతప్పదని కేంద్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతివ్వాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను రాష్ట్ర మంత్రులు కోరారు.
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి, దీని చర్చలో కేంద్ర మంత్రి రిజిజు ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. బిల్లు ముస్లింల హక్కులను పరిరక్షించేందుకేనని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరగనుందని తెలిపారు
రాజ్యసభలో సైతం వక్ఫ్ సవరణ బిల్లు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్లింలకు ఎలాంటి ప్రమాదం జరగబోదని అధికార పక్షం హామీ ఇస్తే.. రాజ్యాంగంపై దాడిగా ప్రతిపక్షం ఆరోపించింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమా డైలాగ్‌తో అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ భూమిని ఆక్రమించారంటూ అధికార పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాలు కంచ గచ్చిబౌలి చుట్టు నడుస్తున్నాయి. గతంలో భూముల విక్రయంపై బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది. ప్రస్తుతం గచ్చిబౌలి భూ వివాదంపై అదే పార్టీకి చెందిన కేటీఆర్ ఏమన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల వేలంపై హెచ్ సీ యూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన పీక్ స్టేజ్‌కు చేరింది. ఓ వైపు విద్యార్థుల నిరసనలు ఉాదృతంగా కొనసాగుతూంటే.. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆందోళనతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
నేపాల్‌లో రాజరికం మద్దతుదారులు గళమెత్తారు. తమకు ప్రజాస్వామ్యం వద్దు, రాజరికమే ముద్దంటూ జరిపిన ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. దేశంలో మళ్లీ రాజరికం స్థాపించాలని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వాన ముంచెత్తింది.
AP Cabinet Decisions: ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు.
వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. రాఘవేంద్ర కాలనీలోని ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో చెడ్డీ గ్యాంగ్ నడుస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సీమాంధ్ర అసోసియేషన్ వారితో గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు.
టొరంటో: కెనడాలోని టొరంటోలో తెలుగు ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం టీసీఏ ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు.
KCR Video Viral: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ భూములపై ఆయన చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ వైరల్ చేసింది.
భారత్ చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు, డ్రాగన్ తరహాలో ఇరుదేశాల సంబంధాలు ఎదగాలని, బలోపేతం కావాలని అనడమే కాక.. శాంతియుతంగా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకోవాలని, సంప్రదింపులు, సమన్వయాన్ని పెంచుకోవాలని, కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
Bhadrachalam Temple: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాల ప్రవాహం భారీగా కొనసాగుతోంది. గడిచిన 10 రోజుల్లో పలువురు భక్తులు కోటి రూపాయాలకుపైగా ఇవ్వడంతో రూ. 32 కోట్లకుపైగా విరాళాలు అందాయి. భక్తుల విశ్వాసానికి ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఈ విరాళాలు భారీగా పెరుగుతున్నాయి.
డాలర్ డ్రీమ్స్ పూర్తిగా చెదిరిపోతున్నాయా? ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అసలు కారణం చెప్పకుండా..స్టుడెంట్ వీసా రాగానే ఎందుకు తిరస్కరిస్తున్నారు.ట్రంప్ వచ్చాక.. అమెరికా కండ కావరం పెరిగిందా? అమెరికాలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థులకు ఒక కల.
ఇటీవల రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్ పగడాల సంచలన వీడియో బుధవారం విడుదల చేశారు. తన సోదరుడు ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోదరుడు ప్రవీణ్ మరణాన్ని కొంతమంది రాజకీయంగా వాడుకొని లబ్ది పొందాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అయితే తమ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.