నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. ఈ నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది. అలాగే ప్రజా ఉద్యమాల ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గం ఏర్పడిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉండగా.. తర్వాత కమ్యూనిస్టుల కంచుకోటగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో మునుగోడు, చౌటుప్పల్(మున్సిపాలిటీ), చండూరు (మున్సిపాలిటీ), సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలు ఉన్నాయి. మొత్తం 1,98,452 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,01,751 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,07,212 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి యాదగిరిరావు.. తన సమీప అభ్యర్థి పి.గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) పై 3,594 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో యాదగిరిరావుకు 57,383 ఓట్లు రాగా.. గోవర్ధన్ రెడ్డికి 53,789 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి పాల్వాయి స్రవంతి (ఇండిపెండెంట్) పై 38,055 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి 69,496 ఓట్లు రాగా.. స్రవంతికి 27,441 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి (కాంగ్రెస్) పై 22,457 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 96,961 ఓట్లు రాగా.. ప్రభాకర్ రెడ్డికి 74,504 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి.. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో 2022లో ఉప ఎన్నికలు వచ్చాయి. 2022 ఉప ఎన్నికలు.. 2022లో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) పై 10,309 ఓట్ల మెజారిటితో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి 97,006 ఓట్లు రాగా.. రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు వచ్చాయి.
పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |